వైసీపీలో చేరనున్న కొణతాల రామకృష్ణ!

Konathala Ramakrishna Joines in YCPఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల నేతలు ,తమకు అనుకూలమైన పార్టీలలో చేరుతున్నారు.తాజాగా మాజీ మంత్రి సీనియర్ రాజకీయవేత్త కొణతాల రామకృష్ణ వైసీపీలో చేరాలని నిశ్చయించుకున్నారు.

జేడీ లక్ష్మినారాయణ రంగు బయటపడిందా?

నిజానికి ఆయన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ,ఎంపీగా, ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసుకున్నారు.అంతేకాదు ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా రాజకీయాలలో ఆయన రాణించారు.రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు.

ఆ తర్వాత ఎందుకనో గానీ వైసీపీ నుంచి కూడా బయటకు వచ్చేశారు.బయటకు వచ్చిన తరువాత ఏ పార్టీలో చేరలేదు.ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన టీడీపీలో చేరతారని వార్తలు వచ్చాయి.

కానీ ఆయన టీడీపీలో చేరడం లేదని కచ్చితంగా చెప్పేశారు.వాస్తవానికి ఈరోజు జగన్ ని కలిసి వైసీపీ తీర్ధం పుచ్చుకోవాల్సింది.కాకపోతే జగన్ చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి మరణించడంతో,రెండు రోజుల్లో కొణతాల జగన్ ని కలుస్తారట.