చిరు కోసమే కొణిదెల ప్రొడక్షన్స్

రామ్ చ‌ర‌ణ్‌ సినీ ఇండస్ట్రీ లో అగ్ర హీరోగా కొనసాగుతూనే కొణిదెల ప్రొడ‌క్ష‌న్ పేరిట ఓ సంస్థ స్థాపించి తండ్రి చిరంజీవి తో ఖైదీ నెం 150 నిర్మించి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

కియారాను తమన్నాతో పోల్చిన చెర్రీ

ఇక ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రాన్ని కూడా చెర్రీ నే నిర్మిస్తున్నాడు.ఇక మీద‌ట ఈ బ్యాన‌ర్‌లో చ‌ర‌ణ్ వ‌రుస‌గా సినిమాలు చేస్తాడ‌ని, బ‌య‌టి హీరోల‌తోనూ పని చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఇదే విషయాన్నీ చరణ్ ను మీడియా ప్రశ్నించగా.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ నాన్నగారి సినిమాలు నిర్మించేందుకు మాత్రమేనని ఫుల్ క్లారిటీ ఇచ్చారు చ‌ర‌ణ్.

నాన్న‌గారి సినిమాలు నేను చేయాల‌న్న స్వార్థంతోనే కొణిదెల ప్రొడక్ష‌న్స్ ప్రారంభించానని,బ‌య‌టి హీరోల‌తో సినిమాలు చేయాల‌న్న ఆలోచ‌న లేద‌ని,నా సినిమాలు చేసుకుంటూ, ప్రొడ‌క్ష‌న్ చేయ‌డం చాలా క‌ష్టం అని చెప్పుకొచ్చాడు చ‌ర‌ణ్‌.

Advertisement