వైసీపీలోకి కోట్ల.. బాబుకి షాక్ తప్పదా?

Kotla Joins in YCPరాయలసీమ పెద్దాయన కోట్ల విజయభాస్కర రెడ్డి కుమారుడిగా, కేంద్ర మాజీ మంత్రిగా కర్నూలు జిల్లాలో, మంచి ఫాలోయింగ్ ఉన్న నేత కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి.ఇటీవలే ఆయన కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు.

వైసీపీలో చేరిన రవి చంద్రారెడ్డి!

ఆ తరువాత ఆయన టీడీపీలో చేరాలని మొదట అనుకున్నారు.దీంతో కుటుంబంతో సహా అందరు ముఖ్యమంత్రిని కలిసి,చంద్రబాబుకి కొన్ని షరతులు పెట్టారు. వాటిని బాబు ఆమోదిస్తేనే పార్టీలో చేరేది అని స్పష్టం చేశారు.

ఇంతలో ఏమైందో ఏమో కోట్ల వైసీపీలోకి రావాలని చూస్తున్నారట.నిజానికి కోట్ల కుటుంబానిది కాంగ్రెస్ కల్చర్. దాంతో ఆయన చేరితే వైసీపీలో చేరాలని ఆయనకు క్యాడర్ మొదటి నుంచి చెబుతోంది.

ఒకపక్క కోట్ల టీడీపీలోకి వెళ్ళడం మెజారిటీ క్యాడర్ కి ఇస్ష్టం లేదని అంటున్నారు. ఇక ఆయన సొంత సోదరుడు వైసీపీ అని ప్రకటించేశారు.

మరోపక్క తన ప్రత్యర్ధి కేఈ తో పేచీలు, క్యాడర్ కి ఇబ్బందులు, పైగా చంద్రబాబుతో వ్యవహారం. ఇవన్నీ చూసుకున్న కోట్ల ఇపుడు వైసీపీ వైపుగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.చూద్దాం జగన్ కోట్లాను ఆహ్వానిస్తారో లేదో!.

Advertisement