వైసీపీలో చేరిన బలమైన టీడీపీ ఎంపీ అభ్యర్థి!

TDP Leader Joined in YSRCPఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఇక రెండు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.దీంతో ఆయా పార్టీల నేతలు వలసలు జోరుగా కొనసాగుతున్నాయి.

జగన్ విషయంలో అదే జరగనుందా?

ఇప్పటికే టీడీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్, మేడా మల్లికార్జునరెడ్డితో పాటు ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబు, మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కిల్లి కృపారాణి తదితరులు వైసీపీలో చేరారు.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థి, పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. హైదరాబాద్ లో వైసీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో ఆయన వైసిపిలో చేరారు.ఈమేరకు రామకృష్ణం రాజుకు జగన్ సాదరంగా స్వాగతం చెప్పి కండువా కప్పారు.

పార్టీలో చేరిన తర్వాత రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ, ఏపీ అభివృద్ది చెందాలంటే జగన్ అదికారంలోకి రావాలని అంతా కోరుకుంటున్నారని ,టీడీపీ తనకు ఎంపీ టికెట్ ఇచ్చినా, నియోజకవర్గ ప్రజలు తనను వైసీపీలో చేరాలని కోరుకున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement