ఏపీలో వైసీపీదే గెలుపు అంటున్న కేటీఆర్!

KTR about YCP Partyఏపీలో ఎన్నికలకు ఇక రెండు నెలల సమయం మాత్రమే ఉంది.ఈ సందర్భంగా నేతలు ఏ పార్టీ అధికారంలోకి రానుందో అంచనాలు వేస్తుంటారు.ఈ క్రమంలో తెరాస పార్టీ నాయకుడు కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.

టీడీపీ నేతల వలసలు అందుకేనట!

తనకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయం తథ్యమని,బాబు చేతకాని తనం వల్లే టీడీపీకి ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాబు వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోందని,చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పడం కాదు కదా విజయవాడలో కూడా చక్రం తిప్పలేడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఏపీకి అన్యాయం జరిగిందని ఓ వైపు మొత్తుకుంటున్న బాబు, మరో వైపు తానే నంబర్ 1 అంటూ చంకలు గుద్దుకుంటున్నారని ,అంతేకాదు ఏపీలో దాడులపై చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో చెప్పాలన్నారు.