జగన్ కోసమే కేటీఆర్ ఇలా చేశాడట!

KTR Commentsకొన్నిరోజుల ముందు వరకూ సీఎం కేసీఆర్ మొదలుకుని, కేటీఆర్, తలసాని వంటి నేతలంతా తప్పకుండా చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తాం, అవసరమైతే ఆంధ్రాలోకి వస్తాం, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు.

బాబుకు అర్థమయిపోయిందా?

ఈ డైలాగులను చంద్రబాబు తెలివిగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆంధ్రా ప్రచారంలో కేసీఆర్ ను విలన్ గా చూపించి సానుభూతి కొట్టేద్దామని ప్లాన్ చేశారు. అందుకే ప్రతి మీటింగ్ లోనూ కేసీఆర్ ను విలన్ గా చూపిస్తున్నారు. దీన్ని ఏపీ జనం కూడా నిజమే కదా అనుకుంటున్నారు.

దీంతో టీఆర్‌ఎస్ నేతలకు సీన్ అర్థమైంది. తమ వల్ల జగన్‌ కు రాజకీయంగా నష్టం జరుగుతుందన్న అంచనాకు వచ్చేశారు. అందుకే ఇప్పుడు మాట మార్చేశారు.

ఆంధ్రా రాజకీయాల్లో తమకు ఎలాంటి పాత్ర లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.ఏపీలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని కేటీఆర్‌ కామెంట్ చేశారు.