చంద్రబాబు పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు !

తెలంగాణ తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , చంద్రబాబు చేసినటువంటి వాఖ్యలపై మాటల యుద్ధం ప్రకటించారు.టీడీపీ కాంగ్రెస్ కలవడాన్ని కేటీఆర్ తప్ప్పుబడుతూ కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశారు.

ఏపీలో వైసీపీదే గెలుపంటూన్న కేటిఆర్

పాము-ముంగిసలా చంద్రబాబు-రాహుల్ ఒక్కటయ్యారని, ప్రజలను మోసం చేయడానికే వారు కలిసిపోయారని కేటీఆర్ అన్నారు.నీతిమాలిన రాజకీయాలు చేయడంలో బాబు చాలా ఎదిగిపోయారని అసలు తనను కొట్టేవారే ఎవరు లేరని కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

కుట్ర, కుతంత్రాలకు మారు పేరు చంద్రబాబే అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఆంధ్రా ప్రజలు తయారుగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు.

టీడీపీకి , ఏపీ ప్రజలే సరైన బుద్ది చెబుతారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రజకూటమి పేరుతొ ప్రజలను దోచుకుందామని పథకాలు రచించారని, కానీ వారికి తగినట్టుగానే ప్రజలు తెరాస కి బ్రహ్మరథం పట్టి కూటమి నాయకులకు తగిన బుడ్డి చెప్పారని కేటీఆర్ అన్నారు.