ఏపీ ప్రభుత్వ క్యాష్ ఫర్ ట్వీట్‌:కేటీఆర్‌

ప్రస్తుతం డేటా స్కాం ఏపీ ప్రభుతావనికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ స్కాం అంత తెలంగాణ ప్రభుత్వంమే చేసింది అని తెలంగాణ ప్రభుత్వం పై నింద వేసే ప్రయత్నంలో తెలుగు దేశం ప్రభుత్వం బిజీ గా వుంది.

అక్రమ కేసులు పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: వైఎస్‌ జగన్‌

ఈ ప్రయత్నం లో భాగంగా నారా లోకేశ్‌ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని డేటా స్కాం తెలంగాణ ప్రభుత్వం చేయించింది అని రుజువు చేయటానికి ప్రయత్నిస్తున్నారు.ఇదే అంశాన్ని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు.

#TSGovtStealsData,#KTRStealsData అనే హ్యాష్‌ ట్యాగ్‌లతో తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు,లోకేశ్‌ ఆదేశాల మేరకు ట్వీట్ల దాడి జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు.వివిధ రాష్ట్రాల నుంచి ట్వీట్లు: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో సంబంధంలేని ట్విట్టర్‌ అకౌంట్ల నుంచి వేల సంఖ్యలో డేటా చౌర్యం కేసుకు సంబంధించి ట్వీట్లు వచ్చాయి.

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా తెలుగు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తడం గమనార్హం.

వీటిని గమనిస్తే కృత్రిమంగా ఒక ట్రెండ్‌ను సృష్టించి డేటా చోరీ అంశాన్ని పక్కదారి పట్టించేలా చంద్రబాబు ఓ ప్రైవేటు ఏజెన్సీకి భారీగా డబ్బులు ముట్టచెప్పి ఈ క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుటీఆర్‌ఎస్‌ అనుమానిస్తోంది. దీనిపై ట్విట్టర్‌ సంస్థకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.