జ‌గ‌న్‌కు టీఆర్ఎస్ వెయ్యి కోట్ల.. పై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్‌ !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గన్ మోహ‌న్‌రెడ్డికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల ఖ‌ర్చు కోస‌మ‌ని వెయ్యి కోట్లు పంపించారు.అటువంటి జ‌గ‌న్‌తో జాగ్ర‌త్త సుమీ అంటూ ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారి వారి పార్టీల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స‌భ‌ల్లో చెబుతున్న సంగ‌తి తెలిసిందే.

చింతమనేని వ్యాఖ్యలు పై దళితుల ఆగ్రహం

జ‌గ‌న్‌పై చేస్తున్న వెయ్యి కోట్ల ప్ర‌చారంపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ స్పందించారు. 

‘చంద్ర‌బాబు మ‌తిస్థిమితం కోల్పోయి తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉండి చేసిన ఆరోప‌ణ‌లే జ‌గ‌న్‌కు తాము వెయ్యి కోట్లు పంపించామ‌ని అంటూ కేటీఆర్ ఎద్దేవ చేశారు. వెయ్యి కోట్లంటూ టీడీపీ నేత‌లు చేస్తున్న మాట‌లు ఆరోప‌ణ‌లే త‌ప్పా.. అందులో ఎటువంటి వాస్త‌వం లేద‌ని కొట్టిపారేశారు’.