డైలమాలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సెన్సార్ రిపోర్ట్!

Lakshmis NTR in Problemsఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన అనంతరం, నందమూరి కుటుంబంలో చెలరేగిన కలతలు,ఆమె విషయంలో నందమూరి కుటుంబీకులు ఎలా స్పందించారు,ఎన్టీఆర్ క్షోభ ఏమిటి అన్నది తెరపై రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘సినిమా ద్వారా చూపించనున్నారు.

విడుదలకు ముందే లాభాలలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’!

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్లు,పాటలకు విశేష స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.ఇక ఈ సినిమా ఈనెల 22న విడుదల కాబోతుండటంతో, ఈ సినిమా సెన్సార్ అధికారుల చేతిలోకి వెళ్లిందట.

అయితే వర్మ దెబ్బకు సెన్సార్ వాళ్లు సైతం కన్ఫ్యూజన్ లో ఉన్నారట.అసలే ఎన్నికల కోడ్ వచ్చేసింది. దీంతో ఈ సినిమాకి సెన్సార్ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వాలా వద్దా? అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారట. దాంతో ముందుగా ఎన్నికల కమీషన్ ని సంప్రదించేందుకు సెన్సార్ బృందం రెడీ అవుతోందట.