‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ట్రైలర్!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.ఇప్పటికే వర్మ చేస్తున్న ట్వీట్లతో ఈ సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పొచ్చు.

తాజాగా ఈ చిత్రబృందం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ ని విడుదల చేశారు.’రామ రామ రామ రామ’ అంటూ మొదలైన ట్రయిలర్ లో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల పాత్రలను, నటుడు మోహన్ బాబు పాత్రను చూపించారు.

ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించారో,అసలు లక్ష్మి పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చిందో కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి మెడలో తాళి కట్టడం, వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ పై చెప్పులు విసరడం ,ఎన్టీఆర్ కూతురు లక్ష్మీ పార్వతిని చెంప దెబ్బ కొట్టడం , చంద్రబాబు వాయస్ తో ‘దానికి కానీ కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్’ అంటూ ట్రయిలర్ లో చూపించారు.

చివరగా ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ,నా జీవితంలో నేను నమ్మి మోసపోయిన వ్యక్తి ఒకేఒక్కడు అంటూ ఆయన పడిన మనోవేదన చూస్తే ఎవరైనా చలించి పోవాల్సిందే.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూడండి.