విడుదలకు ముందే లాభాలలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’!

Lakshmis NTR Pre Businessరామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’,ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్,పాటలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి.దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.అంతేకాదు విడుదలకు ముందే ఈ సినిమా లాభాల బాట పట్టిందట.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను చూడొద్దంటున్న చంద్రబాబు!

ఈ సినిమాని వర్మ నాలుగు కోట్ల బడ్జెట్ తో పూర్తిచేశాడట.ఈ సినిమాకు వర్మ తెచ్చిన క్రేజ్ రీత్యా ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ,ఈ సినిమా రైట్స్ ను తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించి 9 కోట్లకు కొన్నాడట.అంతేకాదు ఒక ప్రముఖ ఛానల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను 3 కోట్లకు కొన్నాడట.

చూస్తుంటే విడుదలకు ముందే ఈ సినిమా 12 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది. వర్మ ఈ సినిమాకు పారితోషకం తీసుకోకుండా బిజినెస్ లో షేర్ అడిగారట.

నిజానికి ఈ సినిమాలో అంతా కొత్త నటీనటులే నటించిన నేపధ్యంలో, పారితోషికాల నుండి మేకింగ్ వరకు అన్ని విషయాలలోనూ ఖర్చు చాల తక్కువ అయిందట.దీంతో వర్మ ప్రమోషన్ ను చాల భారీ స్థాయిలో చేసి, భారీ ఓపెనింగ్స్ రప్పించే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement