‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ డేట్ మారింది !

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు ఆఖరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ప్రేక్షకుల కోసం RRR టీం బంపర్ ఆఫర్

ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు నటిస్తుండగా, లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుంది.నిజానికి ఈ చిత్రం ఈ వారం విడుదల కావాల్సి ఉంది .

కానీ ఈ చిత్రానికి ఇంకా సెన్సార్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా వచ్చే వారానికి వాయిదా పడినట్లు స్వయంగా వర్మనే ప్రకటించారు.

మార్చి 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. జీవీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.