‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల అప్పుడేనట!

Lakshmis NTR Release Dateప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితంతో పాటు, ల‌క్ష్మీ పార్వ‌తి ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌న్నింటిని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు వర్మ చూపించ‌నున్నాడు.

విడుదలకు ముందే లాభాలలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’!

ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే విడుదలయిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్, ట్రైల‌ర్‌ కి భారీ ఆద‌ర‌ణ ల‌బించ‌డంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఈ చిత్రబృందం ఈ సినిమాను మార్చి 15న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో యజ్ఞాశెట్టి లక్ష్మీపార్వతి పాత్రలో నటిస్తుండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు.

Advertisement