‘ఇస్మార్ట్ శంకర్’ లో లోకులు కాకులు ఆంటీ?

Lokulu kakulu jyothy Auntyపూరి జగన్నాధ్ దర్శకుడిగా,రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ”ఇస్మార్ట్ శంకర్’.ఈ సినిమా విజయం అటు పూరికి,రామ్ కి ఎంతో అవసరం.ఇద్దరు సరైన విజయాలు లేక నాలుగడుగులు వెనకపడ్డారనే చెప్పొచ్చు.ఈ దశలో వీరిద్దరూ ఈ సినిమాని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కు జోడిగా ‘ఇస్మార్ట్ గర్ల్’

 

తాజాగా పూరి లోకులు కాకులు ఆంటీని తన ఆఫీస్ కి పిలిపించుకొని మాట్లాడారట.ఇటీవల కాలంలో ఆమె యూట్యూబ్ లో బాగా పాపులర్ అయినా విషయం తెలిసిందే. దీంతో ఆమె సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది.

‘ఇస్మార్ట్ శంకర్’ లో ఆమెకు పూరి చిన్న కామిడీ పాత్రను ఇచ్చారని,సినీ పరిశ్రమలో ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఒకపక్క ఇచ్చినా ఇవ్వొచ్చని వార్తలు వస్తుంటే ,మరోపక్క ఇలాంటి సమయంలో ప్రయోగాలు చేయడని వార్తలు వస్తున్నాయి.

ఏదిఏమైనా ఈ వార్త చిత్రబృందం నుండి అధికారికంగా వెలువడాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్,నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Advertisement