ఫిబ్రవరి 14 న అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్ ముచ్చటైన ప్రేమ ..!

ఈ వేసవి లో బన్నీ నా పేరు సూర్య అనే సైనిక వృత్తాంతం ఉన్న కథ తో వస్తున్న సంగతి తెలిసిందే ! ఈ చిత్ర యూనిట్ భలే కొత్త పద్దతి లో తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. మొదట ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ బన్నీ చాలా సీరియస్ గా సైనిక శిక్షణ పొందుతున్న వీడియో తో వచ్చాడు. తర్వాత గణతంత్ర దినోత్సవం సందర్భం గా సైనికా అనే పాట తో దేశ భక్తి ని నింపే ప్రయత్నం చేశాడు.

ఇప్పుడు ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యం లో ఒక ప్రేమ గీతాన్ని ఈ చిత్రం నుంచి విడుదల చేసే యోచన లో నా పేరు సూర్య టీమ్ ఉన్నారు . “లవర్ అల్సొ ., ఫైటర్ అల్సొ ” అని సాగే ఈ గీతం అల్లు అర్జున్,అను ఇమ్మానుయేల్ మీద చిత్రీకరించారు. ఇక్కడ చూస్తున్న స్టిల్ ఆ పాట లోనిదే !

lover-also-fighter-also-song

ఈ ఇద్దరి జంట చూడ ముచ్చటగా వుంది కదూ ! ఈ స్టిల్ తో బన్నీ ఈ సినిమా లో దేశ భక్తి కలిగిన సైనికుడే కాదు ., ఒక మంచి లవర్ కూడా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు . చూద్దాం మరి ఈ సూర్య ఎలా ఆడి పాడనున్నాడో ఈ పాట లో..! బన్నీ అంటేనే డాన్స్ !!మరి ఈ పాట లో తన మార్క్ చమక్కు లు చూపించాడా లేక ., సరైనోడు లోని తెలుసా పాట లా అలా అలా నడిచేశాడా అనేది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే !

Advertisement