గురు శిష్యుల కలయిక…?

తెలంగాణలో టీడీపీ ఉనికే లేకుండా చేయాలన్న కేసీఆర్ పట్టుదలను భుజాన వేసుకున్న తుమ్మల సక్సెస్ అయినట్టే కనిపించి విఫలమయ్యాడు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

మెచ్చా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తుమ్మలతో భేటికి ప్రాధాన్యత సంతరించికుంది.

దీనిపై సండ్ర కొంత సానుకూల సంకేతాలు ఇచ్చినప్పటికీ.. మెచ్చా మాత్రం ఈ వార్తను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశారు.

తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవాలు అని స్పష్టం చేశారు.
అయితే మాజీ మంత్రి తుమ్మల తనకు రాజకీయ గురువు అని,తమ భేటిలో రాజకీయ కారణాలు లేవన్నారు.