మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలలోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ అంతమే తన ధ్యేయం:డీఎల్‌

ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.జిల్లాలో మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీని విడతారు అన్నే ప్రచారాన్ని నిజం చేస్తూ,టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవితో పాటు, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు పంపించారు.
ఈ సందర్భంగా త్వరలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు.

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కుటుంబ సభ్యులు, మాగుంట అభిమానులు, శ్రేయోభిలాషుల నిర్ణయం మేరకే తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.