టీడీపీకి మరో గట్టి షాక్!

Magunta Srinivasulu Reddy Clarity on Campaignరాబోయే ఎన్నికలలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీలో దించాలని, చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.కానీ చంద్రబాబు ప్రయత్నాలు మాగుంట దగ్గర ఫలించలేదు.

బాబు అడ్డంగా బుక్కయ్యారా?

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చంద్రబాబుతో మాగుంట తేల్చి చెప్పేశారు. తనకు వ్యాపారాలున్నాయని, తనకున్న ఇబ్బందుల వల్ల పోటీ చేయలేకపోతున్నట్లు చెప్పేశారు.

అసలు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలవదన్న ఫీడ్ బ్యాక్ చూసిన తర్వాతే, మాగుంట పోటీనుండి తప్పుకున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

కానీ చంద్రబాబేమో దాన్ని మార్చి చెబుతున్నారు. సిబిఐ దాడులకు భయపడి తమ పార్టీ నేత ఒకరు పోటీ నుండి తప్పుకున్నట్లు మీడియాతో చెప్పారు.చూస్తుంటే రోజురోజుకి టీడీపీ నేతలలో ఓటమి భయం పెరిగిపోతున్నట్టుంది.