మహర్షి’ ఫస్ట్ లు’క్ టీజర్ అప్పుడేనట !

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’.
మహేష్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు అని తెలియడంతో ఈ చిత్రం పై రోజు రోజుకి అంచనాలను భారీగా పెంచుతున్నాయి.

రవి బాబు ఆవిరి ప్రీలుక్

ఇక ఇంతకు ముందు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ప్రకటించారు కానీ ఈ విడుదల తేదీని మార్చాలని భావిస్తోందట చిత్ర యూనిట్.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన మరో వార్త అందుతుంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ విడుదలకు చిత్ర యూనిట్ ఒక డేట్ ను లాక్ చేశారు అన్నట్టు తెలుస్తుంది.

మార్చి 4న మహాశివరాత్రి కానుకగా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే రెండు గెటప్స్ ప్రేక్షకులముందుకు వచ్చి ఆకట్టుకోగా , మూడో గెటప్ కోసం అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Advertisement