మహర్షి నుండి ‘చోటీ చోటీ బాతే..’ పాట విడుదల

వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – పూజా హగ్దే జంటగా తెరకెక్కిన మహర్షి చిత్రం మే 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు .

నెగటివ్ రోల్ లో మిల్కీ బ్యూటీ …!

ఈ నేపథ్యంలో ప్రమోషన్ ను మొదలు పెట్టింది చిత్ర యూనిట్.తాజాగా ఈ చిత్రం నుండి మొదటి పాట ‘చోటీ చోటీ బాతే.. మీఠీ మీఠీ యాదే’ ను ఈరోజు విడుదల చేశారు. ముగ్గురు స్నేహితుల మధ్య చోటుచేసుకున్న సన్నివేశాల ఆధారంగా సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సహం నింపింది చిత్ర యూనిట్. వీరి ముగ్గురికి సంబంధించిన పూర్తి లుక్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి.