‘మహర్షి’ కథ పై ఇంట్రెస్టింగ్ టాక్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 చిత్రం ‘మహర్షి’ .మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం యొక్క కథ పై ఒక ఇంట్రెస్టింగ్ టాక్ సినివర్గాలలో వినిపిస్తోంది.

లీకైన శర్వా న్యూ మూవీ పిక్స్

మహేష్ అమెరికా నుండి అసలు భారతదేశానికి ఎందుకు తిరిగి వస్తాడు అంటే.. ఫ్రెండ్ సమస్యల్లో చిక్కుకున్నందుకు కాదట. అల్లరి నరేష్ పాత్ర మరణిస్తుందని.. ప్రాణ స్నేహితుడి మరణం మహేష్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. దీంతో సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు నడుం బిగిస్తాడని టాక్.

అల్లరి నరేష్ మరణం ఎపిసోడ్ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టిస్తుందని.. ఆ తర్వాత మహేష్ తీసుకున్న నిర్ణయాలు.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నాలు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉంటాయని సమాచారం.

దిల్ రాజు – అశ్విని దత్ – ప్రసాద్ వీ పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే గత వారం రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.త్వరలోనే రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement