మహర్షి మూవీ లేటెస్ట్ అప్డేట్స్

వంశి పైడిపల్లి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న తన 25 వ చిత్రం ‘మహర్షి ‘.
ఈ చిత్రం లో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడు.

వైరల్ అవుతున్న ఆర్య – సయేషాల డ్యాన్స్ వీడియో !

అయితే ఇపుడు చిత్రం యొక్క టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది.ఇంకా రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ వున్నట్లు తెలుస్తుంది.ఆ సాంగ్స్ చిత్రీకరణ ఏప్రిల్ రెండవ వారంలోజరుగనుందని సమాచారం .

ఇక ఫిలిం నగర్ నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క టీజర్ ను ఉగాది రోజు విడుదలచేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం మే 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.