మహర్షి విడుదల వాయిదా పడనుందా ?

Maharshi Release date Postponed

వంశి పైడిపల్లి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న తన 25 వ చిత్రం ‘మహర్షి ‘.
ఈ చిత్రం లో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడు.

రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌

ఇటీవల రెండు సార్లు ఈ చిత్రం విడుదల గురించి నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25 న విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావించగా షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావటానికి మరింత సమయం పడుతుందన్న ఆలోచనతో విడుదల కొద్ది రోజులు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.

ఇక ఈ చిత్రాన్ని మే 9న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మహర్షి యూనిట్‌.అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.పివిపి , దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు .