‘మహర్షి’ షూటింగ్ పూర్తయిందట!

Maharshi Shooting Detailsమహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మహర్షి’.ఈ సినిమా విడుదల గురించి,షూటింగ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

‘మహర్షి’ లో ఆ సాంగ్ కోసం భారీ ఖర్చు

అయితే నమ్రత తాజాగా చేసిన ట్వీట్ వీటన్నిటికీ చెక్ పెట్టింది.’మహర్షి’ సినిమా షూటింగ్ పూర్తయిందని, మహర్షి టీమ్ తో, ఫ్రెండ్స్ తో చాలా సరదాగా దిగిన ఆన్ లొకేషన్ ఫోటోలను పోస్ట్ చేశారు.

ఈ ఫోటోలలో మహేష్ బాబు తో పాటుగా నమ్రత, పిల్లలు గౌతమ్, సితార,అగస్టీన్ జేవియర్ కుటుంబ సభ్యులు, దర్శకుడు వంశీ పైడిపల్లి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ లు కూడా ఉన్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా,ముఖ్యమైన పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నారు.కాగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Advertisement