ఈ సెంటిమెంట్ మహర్షికి కలిసి వస్తుందా?

Maharshi Titleమహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’.ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా ,ముఖ్యమైన పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నాడు.ఈ చిత్రబృందం ఈ సినిమాను మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సితార డాన్స్ కు ఫిదా అంటున్న మహేష్!

నిజానికి మే నెలలో మహేష్ సినిమాలన్ని ఫ్లాప్ అయ్యాయి.కానీ దిల్ రాజు, అశ్వనిదత్ ల బ్యానర్ లో వచ్చిన సినిమాలన్ని మే నెలలో సూపర్ హిట్ అయ్యాయి.అందుకే ఈ సినిమా మీద దిల్ రాజు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.

ఇదిలా ఉంటే మహర్షికి టైటిల్ కూడా ఓ సెంటిమెంట్ గా అనిపిస్తుంది.ఆల్రెడీ తెలుగులో వచ్చిన సినిమా టైటిల్స్ వాడితే, పాత సినిమాలు హిట్టైతే కొత్త సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

గతంలో ‘మహర్షి ‘ సినిమా ఫ్లాప్ అవడంతో, మహేష్ మహర్షి కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు.చూడాలి మరి మహర్షికి ఈ సెంటిమెంట్లు వర్కవుట్ అవుతాయో లేదో.

Advertisement