‘మహేష్ 26’ టైటిల్ ఇదేనట!

Mahesh 26 Movie Title

ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.ఏప్రిల్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది.

మహేష్ బాబుతో సానియా మీర్జా!

ఈ సినిమా తరువాత మహేష్ 26వ సినిమా సుకుమార్ తో చేయనున్నాడు.ఇప్పటికే సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈ సినిమా టైటిల్ పై వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ సినిమా టైటిల్ ‘హర హర శంభో శంకర’ గా రిజిస్టర్ చేయించారని,అది కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ పేరు మీద చేయించారని సమాచారం.

ఏది ఏమైనా సినిమా టైటిల్ బాగుందనే చెప్పాలి.ఈ సినిమా థ్రిల్లర్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సుకుమార్ ఇప్పటికే హింట్స్ ఇచ్చేశాడు.మరోమారు జత కడుతున్న సుక్కు – మహేష్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయనే చెప్పాలి.

Advertisement