సుకుమార్ మూవీ పై క్లారిటీ ఇచ్చిన మహేష్

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోందని ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి.గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన వన్‌ నేనొక్కడినే కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోయినా స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మంచి పేరు వచ్చింది.

‘మహర్షి’ విదుదలకు ఓకే చెప్పని బయ్యర్లు

మల్లి వీరిద్దరూ కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని, సూపర్‌స్టార్‌ కోసం సుకుమార్‌ ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.దీంతో మరోసారి ఇదే కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

అయితే తాజాగా మహేష్.. సుకుమార్‌తో మూవీ ఉండదని ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు.కొన్ని సృజనాత్మక అభిప్రాయ భేదాల వల్ల నేను సుకుమార్‌తో చేయాల్సి సినిమా ఆగిపోయింది.

అద్భుతమైన ప్రతిభ ఉన్న ఓ దర్శకుడిని నేనెప్పుడూ గౌరవిస్తాను. ఆయన దర్శకత్వంలో నేను నటించిన ‘నేనొక్కడినే’కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిపోతుంది.

ఆ సినిమా కోసం పని చేసిన ప్రతీ క్షణం ఎంజాయ్‌ చేశాను. మీ కొత్త సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు మహేష్‌.

Advertisement