మహేష్ మైనపు బొమ్మతో మహేష్ సెల్ఫీ పోజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ సంస్థ తయారుచేసిన సంగతి తెలిసిందే. ఈ బొమ్మను లండన్లో ఉన్న మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టబోతున్న నేపథ్యంలో అంతకంటే ముందు ఈ మైనపు బొమ్మను అభిమానులు కోసం హైదరాబాద్ లో పెట్టడం జరిగింది.

నేడు భాగ్యనగరం రానున్న మహేష్ మైనపు బొమ్మ

మహేష్ అభిమానులకోసం హైదరాబాద్ లోని ఏ.ఎమ్.బీ సినిమాస్ లో ప్రదర్శనకు ఉంచారు.
కాగా ప్రస్తుతం ఈ విగ్రహం చూడటానికి మహేష్ అభిమానులు భారీ ఎత్తున అక్కడకి చేరుకుని విగ్రహాన్ని సందర్శించారు.

అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహేష్ తన మైనపు విగ్రహం పక్కన నుంచొని ఫోజులిస్తూ కనిపించారు. టుస్సాడ్స్ మ్యూజియం వారు ఒక విగ్రహాన్ని సింగపూర్లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి.