ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్న మహేష్!

Mahesh Babu Wishes to Sukumarనేడు సుకుమార్‌ పుట్టిన రోజు సందర్భంగా మహేష్‌ ట్వీట్‌ చేశారు.ఆ ట్వీట్ లో ‘మోస్ట్‌ హంబుల్‌, సూపర్‌ టాలెంటెడ్‌ సుకుమార్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, మన సినిమా కోసం ఎదురు చూస్తున్నాను సర్‌’ అని అన్నారు.

అదరగొడుతున్న మహర్షి సెకండ్ లుక్

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌ లో వచ్చిన వన్‌ నెనొక్కడినే సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేక పోయింది.మళ్లీ మహేష్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి.ఏదైనా సుకుమార్ చేసే సినిమాలు విభిన్నంగా ఉంటాయని తెలిసిందే.మరోసారి రాబోతున్న వీరిద్దరి కాంబినేషన్ హిట్ కావాలనే కసితో సుకుమార్ కథ రెడీ చేస్తున్నారు.

మహేష్‌ ప్రస్తుతం మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.ఈ సినిమాను వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా,మహేష్ సరసన పూజ హెగ్డే ,సోనాల్ చౌహన్ కథానాయికలుగా నటిస్తున్నారు.స్నేహుడి పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నారు.

Advertisement