మహేష్ కోసం అభిమానులు ఇలా చేశారట!

Mahesh with Anil Ravipudiతాజాగా ఆన్ లైన్ లో మహేష్ బాబు కోసం పోలింగ్ నిర్వహిస్తున్నారు.ఈ ఆన్ లైన్ పోలింగ్ ను నిర్వహిస్తున్నది మహేష్ వీరాభిమానులే. ప్రస్తుతం మహేష్ తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చారు.

మహర్షిలో అల్లరి నరేష్ ఇలా కనిపించనున్నాడా !

ఆయన సుకుమార్ తో సినిమాను వదులుకుని అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈనేపధ్యంలో మహేష్ – అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించి, హీరోయిన్ గా సాయి పల్లవి బాగుంటుందా లేదంటే రష్మిక బాగుంటుందా, అన్న విషయమై అభిమానులు ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తున్నారు.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఆన్ లైన్ పోలింగ్ లో రష్మికకు, సాయి పల్లవి కన్నా ఎక్కువ ఓట్లు వస్తున్నట్లు సమాచారం.నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాల ప్రాధాన్యత ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.

మరి మహేష్ -అనిల్ ఈ పాత్ర కోసం రశ్మికకు ఓటు వేస్తారో లేదా సాయి పల్లవికి ఓటు వేస్తారో,వారు అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement