అదే జగన్ గొప్పతనం:యాత్ర దర్శకుడు

Mahi V Raghav about Jaganప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్ ల పర్వం నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ క్రమంలోనే మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు విడుదలయ్యాయి.

‘యాత్ర’ మొదటి టిక్కెట్ రేటు..

తాజాగా ఎలాంటి అంచనాలు లేకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా, మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ‘యాత్ర’ విడుదల అయ్యింది.విడుదలైన అన్ని కేంద్రాల్లో హిట్ టాక్ వచ్చింది.అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతుంది.

నిజానికి ఈ సినిమా పూర్తిగా రాజకీయ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయినప్పటికీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.దీంతో ఈ చిత్ర దర్శకుడు వైఎస్ కుటుంబానికి,జగన్ కి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.

ఆ ట్వీట్ లో, ‘యాత్ర’ సినిమాలో ఏదైనా తేడా జరిగి ఉంటే జగన్ కుటుంబం చాలా నష్టపోయేవారని,అయినా తనను నమ్మి తనపై నమ్మకం ఉంచి రాజశేఖరరెడ్డి గారి జీవిత చరిత్రను చెప్పిన వైఎస్ జగన్ అన్నకు, ఆయన కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు.

హిట్టూ ఫ్లాపు, లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఓ గొప్ప మనిషి తెరపై ఆవిష్కరించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని,అందుకు తగ్గట్టుగానే తెలుగు ప్రేక్షకులు ‘యాత్ర’ను బాగా ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement