‘మహర్షి’ కొత్త పోస్టర్ విడుదల

వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి .మహేష్ కి ఇది 25 వ చిత్రం కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే నటించనుండగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

‘మహర్షి’ లో ఆ సీన్ హైలైట్ కానుందట !

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుండి రేపు ఒక పాట విడుదల కానుంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదలచేసింది చిత్ర యూనిట్.ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్నీ దిల్ రాజు, అశ్విని దత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రం మే 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది