‘మజిలీ’ ఫస్ట్‌లుక్‌ విడుదల

 
అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మజిలీ’. చై-సామ్‌ లది హిట్ కాంబో.ఇద్దరూ ‘ఏం మాయ చేశావె’ సినిమాతోనే తొలి విజయాన్ని అందుకొన్నారు.

రెట్రో లుక్ తో నాగ చైతన్య

ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట, పెళ్లి చేసుకొని భార్యభర్తలుగా మారారు.ప్రస్తుతం ‘మజిలీ’ పెళ్లి తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కావడంతో అక్కినేని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.తాజాగా, ఈ సినిమా యొక్క ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

చైతు , సమంత ఒకరినొకరు ఆప్యాయంగా పట్టుకున్న ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్‌, విశాఖపట్నం అని రాసుంది. ‘ఎక్కడ ప్రేమ ఉంటుందో.. అక్కడ బాధ కూడా ఉంటుందనే కొటేషన్’ ఇచ్చారు.

ఇందులో సమంత రైల్వే క్లర్క్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.’నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదలకానుంది. ఇక చైతూ ట్విట్టర్ లో ‘ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి.

కొత్త ఏడాదిని ఈ చిత్రంతో ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆడ్వాన్స్‌ న్యూఇయర్‌ శుభాకాంక్షలు. శివ నిర్వాణతో కలిసి పనిచేయడం నా కల. ఏప్రిల్‌లో కలుస్తాం’ అని పేర్కొంటూ ఫస్ట్‌లుక్‌ను తన ఖాతాలో షేర్‌ చేశారు.

Advertisement