‘మజిలీ’ లో ఆ సీన్సే హైలెట్ !

అక్కినేని నాగ చైతన్య,సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరి కాంబో లో వస్తున్న చిత్రం కావడం విశేషం.

అనుష్క పారితోషకం అంతేనట

ఈ చిత్రం లో సమంత ఒక రైల్వే ఉద్యోగిగా కనిపించనుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చైతు సామ్ మధ్య జరిగే రొమాంటింక్ సీన్స్ చాలా సహజంగా, సరళమైన రీతిలో తెరకెక్కతున్నాయట.

1990 కాలంలోని ప్రేమ కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో చైతు రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడట.

సమంతతో పెళ్లికి ముందు ఒక గెటప్ లో,అలాగే పెళ్లి తరువాత మరో గెటప్ లో కనిపిస్తాడట.ఇప్పటికే ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతంఅందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement