టీజర్ : చైతు-సమంత ల ‘మజిలీ’

 

‘నిన్నుకోరి’ లాంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మజిలీ’. ‘దేర్ ఈజ్ లవ్దేర్ ఈజ్ పెయిన్’ అనేది క్యాప్షన్.పెళ్లయిన తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘మజిలీ’పై భారీ అంచనాలున్నాయి.తాజాగా లవర్స్ డే సందర్భంగా గురువారం ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు.

‘మజిలీ’ ఫస్ట్ లుక్ విడుదల

‘నీకో సంవత్సరం టైమ్ ఇస్తున్నాను. ఈలోగా సచినే అవుతావో.. సోంబేరి అవుతావో నీ ఇష్టం’ అంటూ రావు రమేష్ చెబుతున్న డైలాగ్‌తో టీజర్ స్టార్ అవుతోంది. ఒక్కసారి పోతే తిరిగి రాదురా.. అది వస్తువైనా, మనిషైనా, నువ్వు నా రూమ్‌లోకి రాగలవేమో గానీ.. నా మనసులోకి మాత్రం ఎప్పటికీ రాలేవు, వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేశావ్’ అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో నాగచైతన్యకు లవ్ ఫెయిల్యూర్ అయినట్లు తెలుస్తుంది.ఇష్టం లేని భార్యతో కాపురం చేసే వ్యక్తిగా చైతు, భర్త పట్టించుకోకపోయినా అతడి పై సముద్రమంత ప్రేమ చూపించే అమాయక భార్యగా సమంత బాగా ఆకట్టుకున్నారు.

షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు.ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.