మామిడికాయ ముక్కల పచ్చడి

మామిడికాయ తో వివిధ రకాలైన ఊరగాయ పచ్చడ్లు చేసుకోవచ్చు . మన ఆంధ్ర లో ఈ మామిడికాయ పచ్చడి ఇష్టపడని వాళ్లు ఎవ్వరూ ఉండరు.ఈ రకమైన పచ్చడి చాలా త్వరగా తాయారు చేసుకోవచ్చు .ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కొబ్బరి ఉండలు 

Mamidikaya Mukkala Pacchadiకావాల్సిన పదార్థాలు;

మామిడి కాయలు – 3 (చిన్న ముక్కలుగా తరుక్కోవాలి),
కారం -2 కప్పులు ,
ఆవాలు – 1 కప్పు (నూనె లేకుండా వేయించుకోవాలి),
మెంతి పొడి – 3/4 టీ స్పూను,
ఉప్పు – 1 కప్పు ,
వెల్లుల్లి – 10 రెబ్బలు,
నువ్వుల నూనె – 1 కప్పు.

తయారీ విధానం;

మామిడి కాయలు శుభ్రంగా తుడిచి, చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
మెంతులు ఆవాలు నూనె లేకుండా వేయించి పొడి చేసుకోవాలి.
బాండీలో నూనె పోసి వేడిచేసి పూర్తిగా చల్లార్చుకోవాలి.
వెడల్పాటి గిన్నెలో కారం, మెంతి పొడి, ఆవ పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని అందులో మామిడి ముక్కలు కూడా వేసి మసాలాలు పట్టేలా బాగా కలపాలి.
తర్వాత చల్లారిన నూనె, వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి మూత పెట్టి ఒక రోజంతా కదల్చకుండా ఉంచాలి.ఈ పచ్చడి దోశలలోనైనా ఇడ్లీలోనైనా లేదా వేడి వేడి అన్నం లోనైనా చాలా రుచిగా ఉంటుంది. మరుసటి రోజు గరిటతో తిప్పి మళ్లీ మూత పెట్టేయాలి.మూడో రోజునుంచి పచ్చడి తినటానికి సిద్ధమవుతుంది.

Advertisement