‘#RRR’ లో మంచు హీరో?

Manchu Manoj in RRRబాహుబలి తర్వార రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘#RRR’. ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

డైసీ ఎడ్గర్ జోన్స్ ఎవరో తెలుసా?

400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ కథానాయికలుగా,ముఖ్యమైన పాత్రలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, వరుణ్ ధావన్ కనిపించనున్నారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ‘#RRR’ లో మంచు మనోజ్ కూడా ఉంటాడని ప్రచారం జరుగుతుంది. అసలు ఈ వార్త ఎలా బయటకు వచ్చింది అంటే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.

బంగారం లాంటి నా బ్రదర్ రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని మెసేజ్ పెట్టాడు.దానితో పాటుగా ‘#RRR’ ఉన్న క్యాప్ తో రాం చరణ్ ను కౌగిలించుకున్నాడు.దీంతో ఈ వార్త బయటకు వచ్చింది.