త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మన్మధుడు-2

‘మన్మధుడు’ చిత్రంతో అక్కినేని నాగార్జున కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఈ సినిమాతోనే నాగార్జునకు మన్మథుడు అనే ట్యాగ్ అంటుకుంది.

తొలిసారి తెర పై వైఎస్ జగన్

నాగ్ కెరీర్ లో గుర్తిండిపోయే చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి.అయితే ఇటీవల నాగార్జున ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.

అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహించగా తాజాగా ఈ చిత్రం యొక్క సీక్వెల్ ని ‘చి ల సౌ’ చిత్రం తో మెప్పించిన యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్
డైరెక్ట్ చేయనున్నాడు.

ఇటీవలే స్క్రిప్ట్ ని నాగ్ కు వినిపించాడట రాహుల్.ఇక రాహుల్ స్క్రిప్ట్ కి ఫిదా అయిన నాగ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే మొదలు కాబోతుంది. ఇక ఈ చిత్రం యొక్క ఇక ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ ని పోర్చుగల్ లో చిత్రీకరించబోతున్నారని సమాచారం.

Advertisement