దిక్కు తోచని స్థితిలో మంత్రి నారాయణ!

Manthri Narayana Campaignరాబోతున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే, ఇంటింటికి నవరత్నాలు అమలు చేస్తామంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్ హామీలు ప్రకటించి ఆంధ్ర రాజకీయాలలో సంచలనం సృష్టించారు. అదే క్రమంలో జగన్ పాదయాత్ర మొదలుపెట్టి మొత్తం ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారు.

ఆ మాటలకు చెక్ పెట్టిన జగన్!

దీంతో టీడీపీ నేతలలో ఓటమి భయం పెరిగిపోయింది.ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలు అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత కూడా పోటీ నుండి తప్పుకున్నారు.తాజాగా మంత్రి నారాయణ కూడా చేతులెత్తేశారట.

ఈ ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి అటకెక్కిన సంగతి తెలిసిందే.దీంతో మంత్రి నారాయణ ఓటుకునోటు పాలసీని నమ్ముకున్నారు.కోట్ల రూపాయలు కూడా కుమ్మరించారు.

కానీ ఇక్కడ ఉన్న బలమైన ప్రత్యర్ధ అభ్యర్థి వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్. ఆయనను ఢీ కొట్టడం నారాయణ వల్ల కాదని ఆయన చేయించుకున్న సర్వేలే తేల్చేశాయట.ఈ సర్వేలతో క్లారిటీకి వచ్చిన నారాయణ ,డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అనుచరులతో చెబుతున్నాడట.