“మీకు మాత్రమే చెప్తా” మూవీ రివ్యూ : టైం పాస్ మూవీ !

Image result for meeku matrame chepta

“మీకు మాత్రమే చెప్తా” మూవీ రివ్యూ అండ్ రేటింగ్ :2.5/5.0

విడుదల తేదీ : నవంబర్ 1st , 2019

నటీనటులు : తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అనసూయ భరద్వాజ్,అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జి థామస్,అవంతిక మిశ్రా,వినయ్ వర్మ

దర్శకత్వం : షమీర్ సుల్తాన్

నిర్మాత: విజయ్ దేవరకొండ ,వర్ధన్ దేవరకొండ

సంగీతం : శివ కుమార్

ఛాయాగ్రహణం : మదన్ గుణ దేవా

ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అనురాజ్ పర్వతనేని

అర్జున్ రెడ్డి ,గీత గోవిందం సూపర్ హిట్స్ తో స్టార్ హీరో గా ఎదిగి ,ఇప్పుడు నిర్మాణ రంగం వైపు అడుగులు వేసాడు విజయ్ దేవరకొండ . పెళ్లిచూపులు సినిమా తో విజయ్ దేవరకొండను హీరో గా పరిచయం చేసి మంచి హిట్ ను అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ,ఇప్పుడు తరుణ్ భాస్కర్ ను హీరో గా పరిచయం చేస్తూ ,తన సొంత బ్యానర్లో “కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ ” పతాకం పై “మీకు మాత్రమే చెప్తా ” సినిమాను నిర్మించాడు విజయ దేవరకొండ .ఈ సినిమా ద్వారా తరుణ్ భాస్కర్ ను హీరో గా ,షమీర్ సుల్తాన్ దర్శకుడు గా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు .విజయ్ ,తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకోవాలి అంటే “మీకు మాత్రమే చెప్తా ” ఏమిటో తెలుసుకుందాము.

నిర్మాతగా మారనున్న విజయ్ దేవరకొండ

కథ :

రాకేష్ (తరుణ్ భాస్కర్),కామేష్ (అభినవ్ గౌతమ్) మంచి స్నేహితులు .ఇద్దరు రేడియో జాకీలు గా పని చేస్తూ వుంటారు .వారు పనిచేస్తున్న టీవీ ఛానెల్ కి మంచి రేటింగ్స్ కోసం వీడియోస్ చేస్తూవుంటారు, ఈ ప్రయత్నం లో రాకేష్ “మత్తు వదలరా ,నిద్ర మత్తు వదలరా ” అనే హనీమూన్ లో గడుపుతున్నట్లు వీడియో చేస్తాడు.రాకేష్,కామేష్ ఇద్దరు డాక్టర్స్ తో ప్రేమలో పడతారు .రాకేష్ పెద్దల అంగీకారం తో డాక్టర్ స్టెఫీ (వాణి భోజన్) పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకుంటారు. పెళ్లి కి రెండు రోజులు ముందు ఈ వీడియో ను సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది, ఆ వీడియో స్టెఫీ చూస్తే పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని ,టెన్షన్ తో ఎలాగ అయినా ఈ వీడియో ను ఆన్లైన్ లో డిలీట్ చేయాలని కామేష్ ని కోరతాడు రాకేష్, వీడియో ని స్టెఫీ చూసిందా,వీడియో ని డిలీట్ చేయటం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు? రాకేష్ ,స్టెఫీ ల పెళ్లి జరిగిందా ? నిజం గా వీడీయో లో వున్నది రాకేష్ నా ,”మీకు మాత్రమే చెబుతాను” అని కధ మొదలు పెట్టిన కామేష్ తన ఫ్రెండ్ స్టోరీ తెలుసుకోవాలి అంటే సినిమా చుడాలిసిందే .

విశ్లేషణ :

ఈ మధ్య కాలం లో ప్రతి వ్యక్తిగత విషయం ఆన్ లైన్ లో వైరల్ అవుతూ మంచి చెడు కి మధ్య వ్యత్యాసం లేకుండా పోతుంది .అలాంటి వ్యక్తిగత విషయాన్ని పాయింట్ గా తీసుకొని మంచి హాస్యాన్ని పంచారు షమీర్.కొత్త పాయింట్ ని తీసుకోని పెళ్లి కి ముందు వ్యక్తిగత విషయం ఆన్ లైన్ లో వైరల్ కావటం తో ,టెన్షన్ తో ముప్పతిప్పలు పడి తన నిజాయితీని నిలబెట్టుకోవటం కోసం ఎలా పరుగు పెట్టాడు ,కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో షమీర్ దర్శకుడు గా బాగానే సక్సెస్‌ అయ్యాడు.టెన్షన్ పాయింట్ నే తీసుకోని పూర్తి గా కామెడీ పండించారు .ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ తో నే సాగింది .సెకండ్ హాఫ్ సాగతీత తో ,కామెడీ మెప్పించ లేక పోయింది స్క్రీన్ ప్లే కూడా కొరవడింది .మొదటి సారి హీరో గా చేసిన తరుణ్ భాస్కర్ తన నటన తో సహజం గా నటించాడు ,తన నటనే సినిమా కి ప్లస్ అయ్యింది .తరుణ్‌ ఫ్రెండ్‌ కామేశ్‌గా నటించిన అభినవ్‌ గోమటం బాగా కామెడీ పండించాడు . వీరిద్దరే సినిమా మొత్తాన్ని నడిపించారు .క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా ప్రేక్షకుడు ఊహించనిదే. . అనసూయ కీలక పాత్రలో కనిపించారు.వాణి భోజన్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అవంతికా మిశ్రా తమ పాత్రల పరిధి మేర నటించారు.చివరగా వచ్చే ‘మీకు మాత్రమే చెప్తా’ పాటలో విజయ్‌ దేవరకొండ మెప్పించాడు.
ఒక్క మాట లో చెప్పాలంటే ., టైం పాస్ మూవీ ! కథా ,కాకర కాయ లేకున్నా పర్లేదు, కొంచెం కామెడీ చాలనుకుంటే “మీకు మాత్రమే చెప్తా ” . మరీ డిసప్పాయింట్ చేయదు.