ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి షాక్!

MLC Election Resultసార్వత్రిక ఎన్నికలకు ముందే టీడీపీని ఓటమి పలకరించింది. ప్రజలల్లో ఓ బలమైన వర్గం ఆ పార్టీకి దూరంగా జరిగినట్లుగా స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇక మిగిలిన వర్గాలు కూడా ప్రభుత్వం తీరుపై ఈ మధ్య గుర్రుగా ఉన్నాయి.

ఏపీలో నకిలీ ఓట్ల భాగోతం!

విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మద్దతుతో పోటీచేసిన గాదె శ్రీనివాసులు నాయుడు ఓటమి చెందారు. మొత్తం ఓట్లలో రఘు వర్మకు 7834 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా, గాదె శ్రీనివాసులునాయుడుకు 5632 మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వచ్చాయి.

మరో అభ్యర్థి అడారి కిషోర్‌ కుమార్‌కు 2548 ఓట్లు పడ్డాయి. ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్లలో రఘు వర్మకు ఎక్కువ రావడంతో ఆయన విజయం సాధించారు.

ఇదిలా ఉండగా టీడీపీ పెద్దలతో రాసుకుపూసుకు తిరిగిన శ్రీనివాసులునాయుడు ఓటమి దేనికి సంకేతమని పార్టీలోనూ చర్చ సాగుతోంది.