బాబు – మోదీల దీక్షలు జగన్ కి లాభమా?

Modi - Babu Meetనాలుగేళ్ళ పాటు కలసి పని చేసిన బీజేపీ, టీడీపీ పొత్తులు ఏడాది క్రితమే పెటాకులు అయ్యాయి. ఇపుడు బాబు, మోడీ శత్రువుల కంటే ఎక్కువగా యుద్ధం చేస్తున్నారు.

రోజురోజుకి దిగజారుతున్న బాబు రాజకీయం!

 

వాస్తవానికి మోదీ- బాబు బద్ద శత్రువులుగా ఉన్నందునే ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర విభజన హమీలు రావడంలేదన్నది సగటు ప్రజల్లో వస్తున్న అభిప్రాయం.పైగా బాబు – మోదీ నేతలు తరచుగా పోట్లాడుకోవడం చూసి జనం విసిగిపోయారు.

ఒకపక్క అధిష్టానంలో మళ్ళీ మోదీనే అధికారంలోకి వస్తాడని,మరోపక్క ఏపీలో జగన్ అధికారంలోకి వస్తారని సర్వేలు చెబుతున్న సమయంలో, ఇక్కడ జగన్ని ఎన్నుకుంటే కేంద్ర సహకరం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారట.

ఏపీలో తటస్తులకు, రాజకీయాలతో సంబంధం లేని వారికి ఇదే అనిపిస్తోందని అంటున్నారు. ఇపుడున్న పరిస్తితుల్లో ఏపీలో జనం రాజకీయాలు కోరుకోవడం లేదు. అందువల్ల మోడీ, జగన్ జోడీకి జనం జై కొట్టినా అందులో వింత ఏమీ లేదనే చెప్పొచ్చు.

Advertisement