అండర్ 19 క్రికెట్ టీమ్ కోచ్ పై ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని మోదీ!

న్యూజిలాండులో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై యువ భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించి. టైటిల్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . టీమ్ విజయం సాధించటంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ పాత్ర అభినాదనీయమంటూ .. క్రీడాభిమానులు మాజీ క్రికెటర్ల వరకు అందరూ ప్రశంసలతో ముంచెత్తారు . బీసీసీఐ భారీ నజరానా కూడా ప్రకటించింది.

తాజాగా ప్రధాని మోదీ బెంగళూరులో జరిగిన పరివర్తన్ ర్యాలీ ముగింపు సభలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా రాహుల్ ద్రావిడ్ పై ప్రశంసల జల్లు కురిపించారు . యువ భారత్ వరల్డ్ కప్ సాధించడంలో ద్రావిడ్ పాత్రను ప్రశంసించాల్సిందేనన్నారు . దేశం గర్వించేలా చేసారని వ్యాఖ్యానించారు. ద్రావిడ్ కన్నడ నేలలో పుటిన బిడ్డని గుర్తు చేశారు. నలుగురి కోసం కష్టపడే స్వభావం కన్నడిగులదని పొగడ్తలతో ముంచెత్తారు. నిజాయితీగా పని చేస్తూ… పరోపకారిగా ఉండటం ద్రావిడ్ నేర్పించాడన్నారు. కర్నాటక సంస్కృతే అదన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్కృతిని నాశనం చేస్తుందని విమర్శించారు.Modi Praises Rahul Dravid

Advertisement