టీడీపీకి గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో డేటా లీక్ వ్య‌వ‌వ‌హారం కుదిపేస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నేత‌లు షాకిస్తూ దెబ్బ‌ మీద దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీని ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌, ఎంపీలు అవంతి శ్రీనివాస్‌, పండుల రవీంద్రబాబు టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

చంద్ర బాబు పై ధ్వజమెత్తిన రోజా

అయితే తాజాగా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అలాగే ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పుకున్నారు. ఇప్పడు గుంటూరు జిల్లాలో మోదుగుల టీడీపీకి రాజీనామా చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ మేరకు స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను ఆయన పంపించారు.సైకిల్ దిగుతున్న మోదుగుల వైఎస్సార్ సీపీలోకి వెళ్ల‌డానికి స‌ర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందు కోసం బుధ‌వారం రాత్రి పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి చాలాకాలంగా చంద్రబాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.పార్టీలో తనను ఒంటరి చేసేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వర్గం ప్రయత్నిస్తుండటంతో ఆవేదనకు గురయ్యారు.

ఇలా పార్టీలో నిత్యం అవమానాలు, పదవులు విషయంలో చిన్నచూపు ఎదుర్కొన్న మోదుగుల అనుచరులతో సూచనలతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.