చంద్రబాబుపై విరుచుకుపడ్డ మోహన్ బాబు!

Mohan Babu Fires on Babuశ్రీవిద్యా నికేతన్ కు రావాల్సిన ఫీజు రీ ఎంబర్స్ మెంటు కోసం తిరుపతిలో మోహన్ బాబు తన విద్యార్ధులతో కలిసి ధర్నా చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకునే రకం కాదన్నారు. అవసరం తీరిపోయాక పక్కన పడేసే రకం చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు.

బాబుకు వార్నింగ్ ఇచ్చిన జగన్!

గడచిన మూడేళ్ళుగా చంద్రబాబు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఇవ్వటం లేదన్నారు. దాదాపు 20 కోట్ల బకాయిలు రావల్సి ఉన్నా నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు మండిపడ్డారు. బకాయిల కోసం ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రయోజనం కనిపించలేదన్నారు.

టీడీపీ నాది నాదని చంద్రబాబు అనటంలో అర్ధం లేదన్నారు. టీడీపీని పెట్టింది ఎన్టీయార్ అన్నారు. ఎన్టీయార్ నుండి పార్టీని చంద్రబాబు లాక్కున్నట్లు చెప్పారు. చంద్రబాబు మాటలను ఎవ్వరూ నమ్మరని కూడా చెప్పారు.

ఇదే ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ను మోహన్ బాబు ఆకాశానికెత్తేశారు.ఈరోజు టీడీపీలో ఉన్న చాలామందిలో ఎన్టీయార్ పై అభిమానంతో ఉన్నవారే అని మరోసారి ఈ సందర్భంగా గుర్తు చేశారు.