ఏపీ ప్రభుత్వ దౌర్జ్యన్యం..మోహన్ బాబును హౌస్ అరెస్ట్

ఏపీ ప్రభుత్వ దౌర్జ్యన్యాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ ప్రముఖ సినీ నటులు, శ్రీ విద్యానికేతన్ కలశాలల అధినేత మోహన్ బాబు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.

నిధులు అందుకునే అర్హత ఏపీకి లేదట

విషయానికి వస్తే ఫీజ్ రీఎంబెర్స్మెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని అందుకు నిరసనగా ఇవాళ ర్యాలీకి పిలుపునిచ్చారు మోహన్ బాబు.ఉదయం 10గంటలకు వేలాది మంది విద్యార్థులతో తిరుపతిలో తన విద్యానికేతన్ కాలేజీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ర్యాలీకి ప్లాన్ చేసారు మోహన్ బాబు.

కాగాఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఉదయం 7గంటలకే విద్యానికేతన్ కాలేజీ ఎదుట భారీగా పొలిసు బలగాలను మోహరించారు.మోహన్ బాబు ఇంటిని చుట్టూ ముట్టి ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.

అయితే మోహన్ బాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిరసన ర్యాలీ ని కొసాగించి తీరుతానని ఈ నిరసనను అణిచివేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అయన మండిపడుతున్నారు.