వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మోహన్‌ బాబు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినీ పరిశ్రమ నుంచి కూడా నటులు వివిధ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే.అయితే మోహన బాబు ఎన్టీఆర్ వున్నపుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వున్న విషయం తెలిసిందే ,ఆ తరువాత పరిణామాలతో టీడీపీ కి దూరంగా వున్నారు.

చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపిన ఆమంచి!

తరువాత వైఎస్ కుటుంబంతో బంధుత్వం కలిగిన మోహన్ బాబు కొన్నాళ్ళుగా జగన్ మోహన్ రెడ్డితో సాన్నిహిత్యంగా ఉంటున్నారు.మోహన బాబు నెలకొలిపిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్సిమెంట్ నిదులని చెలించలేదని కొన్నిరోజుల క్రితం విద్యార్థులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.

దీంతో మోహన్ బాబు వైకాపాలో చేరిపోతారని రాజకీయవర్గాలలో చెర్చ మొదలైంది .దీనిని నిజం చేస్తూ తన కుమారుడు మంచు విష్ణుతో కలసి లోటస్‌ పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి చేరుకున్న మోహన్‌బాబు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ బాబును పార్టీలోకి ఆహ్వానించారు.