కొడుకు సినిమా కోసం మోహన్ బాబు ప్రొస్థెటిక్ మేకప్‌

సీనియర్ నటుడు మోహన్ బాబు , మంచు విష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం గాయత్రి. ఫిబ్రవరి 9న ప్రేక్షకులు ముందుకు వస్తుంది . ఇందులో మోహన్‌బాబు చాలా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆ విషయం సినిమా ట్రైలర్‌ చూస్తే ప్రేక్షకుడిగా స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో ఆయన రెండు ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాత్రల కోసం మోహన్‌బాబు చాలా కష్టపడ్డారు. ప్రొస్థెటిక్ మేకప్‌ వేసుకుని, పాత్రకు తగ్గట్టు తయారయ్యారు. దీనికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను మంచుమనోజ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

‘రోబో’ కోసం రజనీకాంత్‌, ‘దశావతారం’ సినిమా కోసం కమల్‌హాసన్‌ ఈ మేకప్‌ వేసుకున్నారు. దీనికి దాదాపు 3 గంటల కన్నా ఎక్కువ సమయం పడుతుంది.

‘గాయత్రి’ సినిమాకు మదన్‌ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

Advertisement