టాప్1 పొజీష‌న్‌ లో విజయ్ దేవరకొండ!

Most Desirable Man 2018 Listటాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న హీరోలు చాలా అరుదు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరని చెప్పాలి.

తమిళనాడులోని రేసింగ్‌ ట్రాక్ మీద విజయ్!

తాజాగా హైద‌రాబాద్ టైమ్స్ నిర్వ‌హించిన మోస్ట్ డిజైర‌బుల్ మెన్ 2018 లిస్ట్‌లో, విజ‌య్ దేవ‌ర‌కొండ టాప్ 1 పొజీష‌న్‌లో నిలిచాడు. స్టార్ హీరోలైన ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ , రానా, ఎన్టీఆర్ వంటి స్టార్స్ అంద‌రిని వెన‌క్కి నెట్టి మొదటి స్థానం ద‌క్కించుకున్నాడు.

2017లో రెండో స్థానంలో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ,ఈ ఏడాది తొలి స్థానం ద‌క్కించుకోవ‌డం విశేషం. ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్‌ , క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలోనూ నటిస్తున్నాడు.అలాగే తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు.